![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -108 లో..ధన ఆఫీస్ కి వస్తాడు. అప్పుడే టీ కప్ లతో మాణిక్యం ఎదరుపడతాడు. ధన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు పెట్టుబడి మొత్తం సీతాకాంత్ పెడుతున్నట్లు చెప్తాడు. పెట్టుబడి అతని చేత్తో పెడతాడు ఒకే కానీ అది మొత్తం నీకు ఇవ్వమని చెప్పు.. లేదంటే నీకు విలువ ఉండదంటూ ధనకి మాణిక్యం చెప్తాడు. అవును నాన్న నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అని ధన అనేసి.. సీతాకాంత్ దగ్గరికి వెళ్తాడు..
సీతాకాంత్ క్యాబిన్ కి ధన వెళ్లేసరికి రామలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. బిజినెస్ కి సంబంధించి ప్లాన్ రెడీ చేశాను.. మొత్తం అయిదు కోట్లు బడ్జెట్ అని ధన అనగానే.. నీకు బిసినెస్ లో అనుభవం లేదు ఫస్ట్ కాబట్టి అంత డబ్బు మతో కాకుండా ఒక యాభై లక్షలతో ప్లాన్ చెయ్ అని సీతాకాంత్ చెప్తాడు. దాంతో ధన డిస్సపాయింట్ అవుతాడు. నా విషన్ నాకుంది సర్ అని ధన అంటాడు. సర్ చెప్పినట్టు విను నీకేం తెలుసని ధనతో రామలక్ష్మి అంటుంది. అది ఒకే కానీ అంత బడ్జెట్ వద్దు.. యాభై లక్షల బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తే అందరికి చెక్ పంపిస్తానని సీతాకాంత్ అంటాడు. అవి నా పేరు మీద ఇవ్వలేరా అని ధన అంటాడు. అలా రూల్స్ ఒప్పుకోవని సీతాకాంత్ అనగానే.. ధన అయిష్టంగానే ఒకే చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాణిక్యం పిఏకి టీ తీసుకొని వెళ్తాడు. అక్కడ అభి కనబడుట లేదనే పాంప్లెట్ చూసి.. ఇది ఎక్కడిదని అడుగుతాడు. సీతాకాంత్ సర్ ఇచ్చి ఇది ఎవరు వేయించారో కనుకోమన్నారని చెప్తాడు. ఎందుకు అల్లుడు అభి గురించి తెలుసుకోమన్నాడని మాణిక్యం అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు మాట్లాడుకుంటుంటే.. అప్పుడే పిఏ వస్తాడు. పాంప్లెట్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేశాను. అతనికి ఆ పాంప్లెట్ కి అసలు సంబంధం లేదు.. అదంతా భోగస్ అని చెప్తాడు.
ఆ తర్వాత మరి ఎవరు వేయించి ఉంటారని రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు అనుకుంటారు. మీరు నవలలు కూడా చదువుతారా అని టేబుల్ పై ఉన్న బుక్ తీసుకొని చదువుతుంది రామలక్ష్మి. అందులో రామలక్ష్మి ఫోటో ఉందని చూసిన సీతకాంత్.. రామలక్ష్మి చూడకుండా బుక్ తీసుకోబోతుంటే ఫోటో కింద పడుతుంది. వెంటనే సీతకాంత్ తీసుకుంటాడు. ఆ తర్వాత మాణిక్యం అభి ఇంటికి వస్తాడు. తాళం వేసి ఉందేంటని అనుకుంటాడు. ఒకతను వస్తే.. వీళ్ళెక్కెడికి వెళ్లారని మాణిక్యం అడుగగా.. రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వెళ్లారని అతను చెప్తాడు. దాంతో మాణిక్యం ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |